పెద్దమ్మ తల్లిని అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు

పెద్దమ్మ తల్లిని అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మ గుడి)లో ఆదివారం భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఉదయం నుండి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తమను చల్లగా చూడాలని వేడుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం అన్నప్రాసనాలు, వాహన పూజలు, తలనీలాలు, అమ్మవారికి ఒడిబియ్యం, చీరలు, కుంకుమ తదితర మొక్కలను చెల్లించి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. భక్తులకు అవసరమయ్యే ప్రత్యేక దర్శనానికి క్యూలైన్లు, ఉచిత పులిహోర ప్రసాద వితరణ, మంచినీటి వసతి తదితర ఏర్పాట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రజినీకుమారి ఆదేశాల మేరకు సిబ్బంది పర్యవేక్షించినట్లు తెలిపారు.

Blogger ఆధారితం.