మెగా హెల్త్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోండి - లక్కినేని
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో శనివారం మెగా హెల్త్ క్యాంప్ న్యాయవాదుల లైబ్రరీ హాల్లో నిర్వహించనున్నట్లు బార్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ తెలిపారు. ఈ హెల్త్ క్యాంప్‌ను న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.
హెల్త్ క్యాంప్‌కు సంబంధించిన బ్రోచర్‌ను మంగళవారం న్యాయమూర్తులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ "ఆరోగ్యమే మహాభాగ్యం" అని, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మానసికంగా దృఢంగా ఉంటాడని, అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు బి. రామారావు, సుచరిత, సాయి శ్రీ, కొత్తగూడెం బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తోట మల్లేశ్వరరావు, సాదిక్ పాషా, దూదిపాల రవికుమార్, నల్లమల్ల ప్రతిభ, వైద్యులు డాక్టర్ జి. దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment