యాకయ్య కి నివాళులర్పించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : సమగ్ర శిక్షలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన యాకయ్య మృతి పట్ల సమగ్ర శిక్ష ఉద్యోగులు శుక్రవారం సంతాపం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా పాల్వంచ పట్టణ పరిధి అంబేద్కర్ సెంటర్ లో తిరుమల పాలెం మండలం కంప్యూటర్ ఆపరేటర్ హేమలత ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి యాకయ్య కి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం భద్రాద్రికొత్తగూడెం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్, చందు, మహిళా అధ్యక్షురాలు తులసి, సీఆర్పీ జయ బాబు, పాల్వంచ కేజీబీవీ ఉపాధ్యాయులు సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.

Post a Comment