క్రీడాకారులు తమ ప్రతిభతో జాతీయస్థాయికి ఎదగాలి - డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల

 

క్రీడాకారులు తమ ప్రతిభతో జాతీయస్థాయికి ఎదగాలి - డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : క్రీడాకారులు తమకున్న ప్రతిభను ప్రదర్శించి జాతీయస్థాయికి ఎదగాలని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.

మంగళవారం రాత్రి కొత్తగూడెం రామచంద్ర కాలేజీ ఆవరణలో సీఎం కప్ నిర్వహణలో భాగంగా జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు కొత్వాల షీల్డ్ ను అందజేశారు. వాలీబాల్ పురుషుల విభాగంలో పినపాక మండలానికి మొదటి బహుమతి, కరకగూడెం మండలానికి రెండవ బహుమతి లభించగా, మహిళల విభాగంలో కాచనపల్లి మండలానికి మొదటి బహుమతి, దుమ్ముగూడెం మండలానికి రెండవ బహుమతిని అందుకున్నారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ క్రీడాకారులు మండల, జిల్లా స్థాయిల్లోనే పరిమితం కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించేందుకు కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, క్రీడాకారులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ పరంధామరెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, చైర్మన్ మహీధర్, సెక్రటరీ రాజేంద్రప్రసాద్, కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు, మాలోత్ కోటి నాయక్, డిష్ నాగేశ్వరరావు, అశోక్, ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.