యూట్యూబర్ ప్రసాద్ బెహరా కు 14 రోజుల రిమాండ్

యూట్యూబర్ ప్రసాద్ బెహరా కు 14 రోజుల రిమాండ్


జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్  :ప్రముఖ యూట్యూబర్, "పెళ్లివారమండి" వెబ్ సిరీస్ నటుడు, దర్శకుడు ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్ట్ చేశారు. మణికొండకు చెందిన ఓ యువతి.. ప్రసాద్‌ బెహరాపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..ప్రసాద్‌తో షూటింగ్‌ సమయంలో పరిచయం అయ్యినట్లు తెలిపింది. ఆ సమయంలో అతను అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపించింది. ఆమె అతన్ని నిలదీశాక ప్రసాద్ క్షమాపణలు చెప్పినట్లు ఆమె పేర్కొంది. అయితే, ఆ తర్వాత రోజు మరో వెబ్ సిరీస్ షూటింగ్‌లో కూడా ప్రసాద్ అదే ప్రవర్తన కొనసాగించడంతో బాధితురాలు మరింత కుంగిపోయింది.

ఈ సంఘటన జరిగిన తర్వాత డిసెంబర్ 11న షూటింగ్‌ అనంతరం ఇంటికి వెళ్ళేటప్పుడు, ప్రసాద్ ఆమెపై దాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

పోలీసులు కేసు నమోదు చేసి, ప్రసాద్‌ను కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ప్రసాద్ బెహరా యూట్యూబ్ లో "పెళ్లివారమండి" వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు పొందారు. "కమిటీ కుర్రాళ్లు" సినిమాలో కూడా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు.


 

Blogger ఆధారితం.