అమ్మ దయ ఉంటే అంతా మంచే జరుగుతుంది - డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :అమ్మలకన్న అమ్మ దయ ఉంటే అంతా మంచే జరుగుతుందని రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
శనివారం పట్టణంలో భవాని దీక్షాపరులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బాపూజీ నగర్‌లోని ఆంజనేయస్వామి దేవాలయంలో పూజారి దినకర శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. భవాని దీక్షాపరులకు, భక్తులకు అన్నదానం నిర్వహించారు. పట్టణంలో భవానీలు నగర సంకీర్తన నిర్వహించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ జగన్మాత అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రపంచం సుభిక్షంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో భవాని దీక్షాపరులు గొర్లె నరేష్, లక్ష్మీనారాయణ, గోవింద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప దీక్షాపరుల ఇరుముడి పూజల్లో పాల్గొన్న కొత్వాల
పాల్వంచ అయ్యప్పస్వామి దేవాలయంలో మాల వేసుకొని, 41 రోజుల దీక్ష అనంతరం జరిగిన ఇరుముడి కార్యక్రమాల్లో కొత్వాల పాల్గొని పూజలు చేశారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ జడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు వై. వెంకటేశ్వర్లు, భూక్యా కిషన్, భూక్యా శంకర్, భూక్యా గిరిప్రసాద్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Post a Comment