మట్టి ఇటుకల ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :ములకలపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మట్టితో చేసిన ఇటుకల ప్రహరీ గోడ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా కంప్రెసర్ మిషన్‌తో ఇటుకలను తయారుచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టే మట్టితో చేసిన ఇటుకల తయారీ భాగంగా ములకలపల్లి లో మోడల్ ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
తక్కువ పెట్టుబడితో సహజంగా గ్రామాల్లో దొరికే మట్టి మరియు పంట చేల గట్లలో దొరికే రాళ్లతో అవసరమైన పరిమాణంలో ఇటుకలు తయారుచేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ ఇటుకల తయారీలో 7 శాతం మట్టి, 2 శాతం సున్నం, 1 శాతం సిమెంట్ కలిపి ఉపయోగించవచ్చని కలెక్టర్ వివరించారు.
ఈ ప్రక్రియతో ఆసక్తి ఉన్నవారు చిన్న తరహా ఇటుకల పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందటంతో పాటు, కొంతమంది స్థానికులకు ఉపాధి కూడా కల్పించవచ్చన్నారు.

Post a Comment