తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయోత్సవం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :కేటీపీఎస్ 6వ దశలో 11వ యూనిట్ వంద రోజులు నిరంతరం కొనసాగిన సందర్భంగా తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 6వ దశ చీఫ్ ఇంజనీర్ మేక ప్రభాకర్ రావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ జి. ధర్మారావులకు అసోసియేషన్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మేక ప్రభాకర్ మాట్లాడుతూ, సమిష్టి కృషితోనే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయని చెప్పారు. ఇలాంటి మరిన్ని విజయాలను సాధించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కూరపాటి రమేష్, వరికూటి శ్రీనివాసరావు, రజిత, దాసరి వెంకటేశ్వర్లు, కీర్తి భాగ్యరాజు, పోదెం కృష్ణ, కన్నయ్య, తంబాల వెంకటేశ్వర్లు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Post a Comment