జాతీయ లోక్ అదాలత్‌పై జిల్లా కోర్టులో సమీక్ష సమావేశం

జాతీయ లోక్ అదాలత్‌పై సమీక్ష సమావేశం

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :కొత్తగూడెం జిల్లా కోర్టు లైబ్రరీ హాల్లో మంగళవారం జాతీయ లోక్ అదాలత్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అధ్యక్షత వహించగా...డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్ఎస్‌ఏ) కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బి. రామారావు, న్యాయమూర్తులు ఏ.సుచరిత, కె. సాయి శ్రీ  హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ అనేది కేసులను వేగంగా పరిష్కరించుకునే, స్వచ్ఛంద రాజీ ద్వారా సమస్యలను పరిష్కరించే ప్రత్యేకమైన వేదిక అని తెలిపారు. న్యాయార్థులు ఈ అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సత్వర సహకారం అందించాల్సిన అవసరముందని చెప్పారు.

జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం అవ్వడం న్యాయ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. అనంతరం జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు అవసరమైన ప్రణాళికలు, నిర్వహణ విధానాలపై చర్చించారు.

ఈ సమావేశంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, న్యాయవాదులు తోట మల్లేశ్వరరావు, రవికుమార్, సాదిక్ పాషా, నల్లమల్ల ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.