విద్యార్థి దశ నుండే క్రీడల పట్ల ఆసక్తి చూపి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందాలి - కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :యువత విద్యార్థి దశ నుండే క్రీడల పట్ల ఆసక్తి చూపి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాలని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల్ శ్రీనివాసరావు అన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ క్రీడల్లో భాగంగా మంగళవారం పాల్వంచ మున్సిపల్ పరిధి శ్రీనివాస కాలనీలోని క్రీడా ప్రాంగణంలో మున్సిపల్ స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నారు.ఈ క్రీడా పోటీలను కొత్వాల ఒలింపిక్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేవిధంగా క్రీడలకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాల్లో క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికితీసే విధంగా క్రీడలు నిర్వహించడం శుభపరిణామం అని అన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారుడు క్రీడల్లో పాల్గొని, తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమాల్లో పాల్వంచ మున్సిపల్ కమీషనర్ సుజాత, జిల్లా స్పోర్ట్స్ అధికారి పరంధామరెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ మహీధర్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, పి.డి.లు నగేష్, రాము, చిన్న బాబురావు, సుందరమ్మ, నాన్సీ, శ్వేతా, మున్సిపల్ సిబ్బంది ఫరీద్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment