దేశీ బ్యాచ్ ఇన్‌పుట్ డీలర్లకు శిక్షణ కార్యక్రమం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : చుంచుపల్లి మండలం రామవరం రైతు వేదికలో బుధవారం 2024-25 సంవత్సరానికి సంబంధించిన దేశీ బ్యాచ్ ఇన్‌పుట్ డీలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు డీలర్లకు శిక్షణ అందించారు. డీలర్లకు బ్యాగులు, ఆరు రకాల రిజిస్టర్లు (సమస్య పరిష్కార రిజిస్టర్, పొలం సందర్శన రిజిస్టర్, ప్రాంతాలవారీ పంటల రిజిస్టర్, అసైన్‌మెంట్ రిజిస్టర్, రైతు విజయగాథ రిజిస్టర్, హెర్బెరియం రిజిస్టర్) నిర్వహణపై మార్గదర్శకాలు అందించారు.
నత్రజని ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు అజోల్లా జీవన ఎరువు ప్రాముఖ్యతను వివరించారు. అజోల్లా గాలిలోని నత్రజనిని గ్రహించి పంటలకు అందించడం ద్వారా యూరియా వినియోగాన్ని తగ్గించవచ్చని వివరించారు. అలాగే, మునగ సాగు వల్ల లభించే ఆర్థిక లాభాలను కూడా వివరించారు.
ఈ కార్యక్రమంలో డేవిడ్ జైపాల్ రావు, రంజిత్ కుమార్, దేశీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Post a Comment