రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ

రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : గత నెల రోజుల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు సి.ఈ.ఐ.ఆర్ పోర్టల్ ద్వారా పోలీసులు రికవరీ చేసిన 220 మొబైల్ ఫోన్లను బాధితులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ బుధవారం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు వెంటనే CEIR పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా అడిగిన అన్ని రకాల వివరాలను కచ్చితంగా నమోదు చేసుకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి తిరిగి వారి మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి కనిపెట్టడం జరుగుతుందని తెలియజేశారు. 

కావున ఎవరైనా తమ మొబైల్ దొంగిలించబడినా, పోగొట్టుకున్నా వెంటనే CEIR పోర్టల్ ద్వారా తిరిగి వారి మొబైల్ ఫోన్ లను పొందవచ్చునని తెలిపారు. పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న తమ మొబైల్ ఫోన్ వివరాలను పొందుపరిచి ఫిర్యాదు చేయగలిగితే అట్టి ఫోన్లను సులభంగా కనిపెట్టవచ్చని ఈ సందర్బంగా ఎస్పీ తెలిపారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను అవతల వ్యక్తి వినియోగించాలని ప్రయత్నించినప్పుడు మాత్రమే ఆ మొబైల్ ను ట్రేస్ చేయగలమని అన్నారు.

అనంతరం బాధితుల మొబైల్ ఫోన్లను కనిపెట్టి వారికి అందజేయడంలో కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందినికి ఎస్పీ అభినందించి వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి, ఐటి సెల్ ఇంచార్జి సీఐ నాగరాజు రెడ్డి, ఐటి సెల్ సభ్యులు విజయ్, రాజేష్, నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.