అయ్యప్పస్వామి పడిపూజలో పాల్గొన్న డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :పాత పాల్వంచలోని భక్తంజనేయస్వామి దేవాలయంలో అయ్యప్పస్వామి పడిపూజను ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి దేవాలయంలో పూజారి బృందావనం నర్సింహమూర్తి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాములు భక్తిగీతాలు ఆలపించారు. మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పడిపూజలో పాల్గొన్న కొత్వాల..
అయ్యప్పస్వామి పడిపూజలో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమాల్లో గురుస్వాములు బందెల శ్రీనివాస్ స్వామి, మల్లెల నాగేందర్ స్వామి, పుప్పాల వెంకటేశ్వర్లు స్వామి, ముదిగొండ వెంకన్న స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment