పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న సింగరేణి జనరల్ మేనేజర్లు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలం, కేశవాపురం - జగన్నాధపురం గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మ తల్లి గుడి) లో ఆదివారం సింగరేణి సేఫ్టీ కార్పొరేట్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ దంపతులు, సింగరేణి ఎస్టేట్ జీఎం రాధాకృష్ణ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం వీరికి అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు.

Post a Comment