జనవరి 3న పెద్దమ్మ తల్లి గుడిలో టెండర్లు, బహిరంగ వేలాలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలంలోని జగన్నాధపురం-కేశవాపురం గ్రామాల్లో గల శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి) ఆధ్వర్యంలో జనవరి 3, 2025, శుక్రవారం మధ్యాహ్నం 2:00 గంటల నుంచి దేవాలయానికి సంబంధించిన వివిధ లైసెన్సులు, అమ్మకాల కోసం టెండర్లు మరియు బహిరంగ వేలాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
అమ్మకాలు, లీజు హక్కుల వివరాలు ఇలా ఉన్నాయి:
1. కొత్త కాంప్లెక్స్‌లోని షాపు నెం-4: లీజు రుసుము రూ.50,000/-
2. ఏసీ ఫంక్షన్ హాళ్ల లీజు హక్కు (ఒక్క హాల్‌కి): లీజు రుసుము రూ.5,00,000/-
3. పాత కాంప్లెక్స్‌లోని షాపు నెం-1లో బొమ్మలు, బల్లలు, ఇతర వస్తువులు: ధర రూ.20,000/-
4. దేవస్థానం తరపున ప్రోగుచేసిన చీరల అమ్మకం: రుసుము రూ.20,000/-
అభ్యర్థులు తగిన రుసుమును చెల్లించి షెడ్యూల్‌ను పొందవచ్చు. టెండర్లను ధరవత్తు డి.డి.ను జతపరచి, జనవరి 3న మధ్యాహ్నం 1:30 గంటల లోపు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి బహిరంగ వేలం ప్రారంభమవుతుంది.
ఆసక్తి గల అభ్యర్థులు షెడ్యూల్‌లో పేర్కొన్న నిబంధనలు పాటిస్తూ, టెండర్లు వేయాలని, బహిరంగ వేలంలో పాల్గొనాలని దేవస్థానం అధికారులు సూచించారు.

Post a Comment