డైట్ మెనూ ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

డైట్ మెనూ ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :బూర్గంపాడు మండలం ఉప్పుసాక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన డైట్ మెనూ ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సరస్వతీదేవి, మహాత్మా గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ గ్రామాల నుండి హాస్టల్లో ఉన్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని డైట్ మెనూ ప్రారంభించిందని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి బిడ్డలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని కోరారు. "మీ బిడ్డలు ఉన్నత చదువు చదివి రేపటి భవిష్యత్తులో అనేక రంగాలలో ఉద్యోగాలు సాధించి దేశానికి, కుటుంబానికి ఆదర్శంగా నిలవాలని" ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు హాస్టల్‌లో భోజనం చేశారు.


ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.