గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం: జిల్లా కలెక్టర్

 

గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం: జిల్లా కలెక్టర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీజీపీఎస్సీ నిబంధనల మేరకు ఆదివారం 15, సోమవారం 16 తేదీలలో జిల్లాలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.


జిల్లాలో మొత్తం 13,465 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షకు హాజరుకానున్నారని, ఇందుకు కొత్తగూడెం పట్టణంలో మొత్తం 38 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అభ్యర్థులందరూ పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఆయన సూచించారు.


అన్ని శాఖల అధికారులు సమన్వయంతో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


Blogger ఆధారితం.