ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ ఏకైక అజెండా - ముత్యాల విశ్వనాథం

ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ ఏకైక అజెండా - ముత్యాల విశ్వనాథం

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ ఏకైక అజెండా అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం అన్నారు. బుధవారం సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల రాంబాబు, బండ్రుగొండ మాజీ సర్పంచ్ వగెల పద్మ పాల్వంచ పట్టణంలోని చండ్ర రాజేశ్వరరావు భవన్ లో సీపీఐ లో చేరారు. వారికి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ ఏకైక అజెండా అని, కార్మికులకు, కర్షకులకు, పేద వర్గాలకు ఎర్ర జెండానే భరోసాగా నిలుస్తోందన్నారు. వందేళ్లుగా ప్రజల పక్షం వహిస్తూ బలమైన రాజకీయ శక్తిగా సిపిఐ నిలబడిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ పాల్వంచ పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా, పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్ రావు, జిల్లా సమితి సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్, డి. సుధాకర్, ప్రజాసంఘాల నాయకులు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, ఇట్టి వెంకట్రావు, అన్నరపు వెంకటేశ్వర్లు, శనగారపు శ్రీనివాస్ రావు, అస్లాం, మాజీ సర్పంచ్ భూక్యా విజయ్, కొత్త సురేష్, కోటి నాగేశ్వరరావు, ఆదినారాయణ, బానోత్ రంజిత్, వెంకన్న, బొమిన సత్యనారాయణ, లాల్ పాషా తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.