గెలుపు ఓటములను సమాన రీతిలో స్వీకరించాలి - ఎమ్మెల్యే కూనంనేని
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : విద్యార్థులు క్రీడలలో గెలుపు, ఓటములను సమాన రీతిలో స్వీకరించాలని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 క్రీడా మహోత్సవంలో భాగంగా కొత్తగూడెం పురపాలక వార్డు నెం.27లోని ప్రగతి మైదాన్ గ్రౌండ్‌లో కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన సీఎం కప్ 2024 క్రీడలను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు.
ఈ సీఎం కప్ 2024 క్రీడా మహోత్సవంలో స్థానిక విద్యాసంస్థలు, కళాశాలల విద్యార్థులు ఫుట్‌బాల్, కబడ్డీ, ఖో-ఖో, అథ్లెటిక్స్ క్రీడలను ఉత్సాహంగా ఆడగా వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచిన జట్లు జిల్లా స్థాయికి పంపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో స్నేహపూర్వత పోటీతత్వం అలవర్చుకోవాలని, గెలుపు, ఓటములను సమాన రీతిలో స్వీకరించాలని సూచించారు.
అనంతరం కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు సెల్‌ఫోన్ వ్యసనానికి దూరంగా ఉండి క్రీడలను ఎంచుకొని వాటి ద్వారా ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ టి.శేషాంజన్ స్వామి, కొత్తగూడెం తహసీల్దార్, వార్డు సభ్యులు, సానిటరీ ఇన్స్‌పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
.webp)
Post a Comment