అయ్యప్పస్వామి మహాపడిపూజలో పాల్గొన్న కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాత పాల్వంచలో సోమవారం రాత్రి నిర్వహించిన అయ్యప్పస్వామి మహాపడిపూజలో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని పూజలు నిర్వహించారు.
రజక సంఘం ఆధ్వర్యంలో 30 మంది అయ్యప్పస్వాములు నిర్వహించిన పడిపూజల్లో భజన కార్యక్రమాలు జరిగింది. పాల్వంచ పట్టణానికి చెందిన స్వాములు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను వైభవంగా జరిపారు. అయ్యప్పస్వామి దేవాలయం పూజారి బృందావనం నరసింహమూర్తి అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కొత్వాల శ్రీనివాసరావు, దేవస్థానం ట్రస్ట్ సభ్యులు, గురుస్వాములను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ముదిగొండ వెంకన్న, అమరాబాదుల సీతయ్య, నల్లగట్ల నవీన్, కొమర్రాజు బ్రహ్మం, మేడిద సంతోష్ గౌడ్, బందెల శ్రీనివాస్, కనగాల రాంబాబు, మిరియాల కమలాకర్, బండి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment