పెద్దమ్మగుడిలో మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం(పెద్దమ్మగుడి)లో దేవాలయ పవిత్రత, భక్తుల శ్రేయస్సు కోసం మార్గశిర మాసంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు డిసెంబర్ 25 బుధవారం నుండి డిసెంబర్ 27 శుక్రవారం వరకు మూడు రోజులపాటు జరుగుతాయి. ఈ మేరకు మంగళవారం పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి కార్యనిర్వహణాధికారి ఎన్. రజనీకుమారి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
పవిత్రోత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, వేదపారాయణాలు వంటి పర్వదిన కార్యక్రమాలు ఎ.ఎస్.కె. సంతోష్ కుమార్ శర్మ ఋత్వికుల - ఖమ్మం బృందం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
భక్తులు ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపను పొందవచ్చని వారు కోరారు.

Post a Comment