క్యాలెండర్ల ఉచిత పంపిణీ అభినందనీయం - జిల్లా జడ్జి

క్యాలెండర్ల ఉచిత పంపిణీ అభినందనీయం - జిల్లా జడ్జి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : వాల్ క్యాలెండర్లను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. మంగళవారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన ఆరు పేజీల 2025 సంవత్సరపు క్యాలెండర్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ కొత్తగూడెం కోర్టు లైబ్రరీ హాలులో ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు తమ పని ప్రణాళికను సిద్ధం చేసుకోవడంలో ఏ.ఐ.ఎల్.యు. క్యాలెండర్ ఉపయోగపడుతుందని, వాల్ క్యాలెండర్లు ముద్రించి, న్యాయవాదులకు ఉచితంగా పంపిణీ చేయటం అభినందనీయమని ఏ.ఐ.ఎల్.యు. కృషిని ప్రశంసించారు. ఈ వాల్ క్యాలెండర్ లో కోర్టు పనిదినాల వివరాలతో పాటు, తెలుగు తిధులు, ఇతర పండగల వివరాలతో, కుటుంబం మొత్తానికి పనికి వచ్చే విధంగా ఉంది అని అన్నారు.


అనంతరం తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు, ఏ.ఐ.ఎల్.యు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ వికేంద్రీకరణకు ఏ.ఐ.ఎల్.యు. కట్టుబడి ఉందని, కక్షిదారుల చెంతకు కోర్టులను తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు బి. రామారావు, ఏ.సుచరిత, ఏ.ఐ.ఎల్.యు. కోర్టు కమిటీ అధ్యక్షులు కె. పుల్లయ్య, కొత్తగూడెం బార్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మక్కడ్,

ఏ.ఐ.ఎల్.యు. జిల్లా బాధ్యులు జె.శివరాం ప్రసాద్, పి. కిషన్ రావు, రావిలాల రామారావు, జి.కె. అన్నపూర్ణ, జి. సునంద, అరికాల రవి కుమార్, ఉప్పు అరుణ్, తెల్లబోయిన రమేష్, పిట్టల రామారావు, శ్రీరాముల రవి, బార్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు తోట మల్లేశ్వర్ రావు, ఎస్.ప్రవీణ్ కుమార్, దూదిపాల రవి కుమార్, సాదిక్ పాషా, నల్లమల ప్రతిభ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పి.వి.డి. లక్ష్మీ, లావణ్య, విశ్వ శాంతి సీనియర్ న్యాయవాదులు ఉదయ భాస్కర్ రావు, వై. బాబురావు, వి.వి.సుధాకర్ రావు, వి. నాగిరెడ్డి, ఆర్. విజయ్ కుమార్, పి.గణేష్ బాబు, ఏ. రాం ప్రసాద్, జి. రామచంద్రా రెడ్డి, జె. పద్మనాభ రావు, వెల్లంకి వెంకటేశ్వర రావు, భాగం మాధవ రావు, డి. రమేష్, ఎస్. విజయ భాస్కర్ రెడ్డి, ఎల్.వి. దుర్గ రావు తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.