నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

 

నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జిల్లా ప్రజలకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. జిల్లాలో మంచి పంటలు పండాలని, పారిశ్రామికంగా, విద్యాపరంగా, పర్యాటకంగా మంచి అభివృద్ధిని సాధించాలని కోరుకుంటున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని, అన్ని రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు. కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ నూతన సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి జిల్లా అధికారులు అందరూ కలిసి కొత్త ఉత్సాహంతో పని చేద్దామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

Blogger ఆధారితం.