మున్నూరు కాపులు అన్నీ రంగాల్లో రాణించాలి - డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం పరిధిలోని మొండికుంట గ్రామంలో సోమవారం అశ్వాపురం మండల మున్నూరు కాపు సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను కొత్వాల ఆవిష్కరించారు. నూతన సంవత్సరం కేక్ ను కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ మున్నూరు కాపు కులస్థులు ఎలాంటి విభేదాలు లేకుండా ఐకమత్యంతో ముందుకు సాగాలన్నారు. తానెప్పుడూ మున్నూరు కాపులకు అందుబాటులో ఉంటాననీ, వారికి తన వంతు సహకారం అందిస్తానని కొత్వాల అన్నారు.
ఈ సందర్భంగా అశ్వాపురం మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కమటం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్వాల ను శాలువా, బొకే, మొమెంటో లతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కమటం వెంకటేశ్వరరావు, గౌరాధ్యక్షులు ఆసా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కాసరబాధ రాములు, కోలా నాగేశ్వరరావు, పాల్వంచ మాజీ జడ్పిటిసి యర్రంశెట్టి ముత్తయ్య, తోట శ్రీనివాసరావు, పులి సత్యనారాయణ, మాలోత్ కోటి నాయక్, కమటం సురేష్, ఆవుల రవి, నల్లపాటి సత్యనారాయణ, యువజన సంఘం అధ్యక్షులు పర్వత సురేష్, మండల కార్యవర్గ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment