ముక్కోటి ఉత్సవాలకు రండి... జిల్లా కలెక్టర్‌కు భద్రాచలం రామాలయ్య ఈవో ఆహ్వానం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జనవరి 9, 10 తేదీల్లో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈవో రమాదేవి ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌ను ఐడీఓసీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.
ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్‌కు ఆహ్వాన పత్రిక అందించి ఆశీర్వచనాలు అందించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భద్రాచలం ఆలయ ఈవోను ముక్కోటి ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. భక్తులకు తాగునీరు, వసతి, వైద్య, భద్రత సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
వేడుకల ఏర్పాట్లు భక్తులు మెచ్చే విధంగా చేయాలని, ముక్కోటి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని సూచించారు.

Post a Comment