విద్య నేర్పిన గురువును, విద్యాలయాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలి - డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : విద్య నేర్పి సమాజంలో ఉన్నత స్థానానికి ఎదిగేలా చేసిన గురువులను, విద్యనభ్యసించిన విద్యాలయాన్ని జీవితాంతం గుర్తుంచుకోవాలని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
ఆదివారం పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ పరిధిలోని జూనియర్ కళాశాలలో జరిగిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో కొత్వాల అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 50 సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దిన ఘనత పాల్వంచ కళాశాలకే దక్కిందని తెలిపారు. విద్య నేర్పిన గురువును దైవంలా చూడాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ పసుపులేటి శంకర్, తహసీల్దార్ వివేక్, DIEO వెంకటేశ్వరరావు, జిల్లా ప్రణాళికాధికారి సంజీవరావు, మాజీ జడ్పిటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి. యుగంధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, పలువురు రిటైర్డ్ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment