జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :పాల్వంచ మండలం, కేశవాపురం - జగన్నాధపురం గ్రామంలో వెలిసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మ తల్లి గుడి) నందు భవానీ దీక్షాపరుల ఇరుముడి కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. కేశవాపురం - జగన్నాధపురం గ్రామంలోని 50 మంది భవాని దీక్షపరులు ఈ ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస్, రమేష్ ఆధ్వర్యంలో భవానీ దీక్షపరులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Post a Comment