రైతుల సంక్షేమానికే సిఎం రేవంత్ రెడ్డి పెద్ద పీట - కొత్వాల
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : రైతుల సంక్షేమానికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం జిల్లా పరిధిలోని నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో డీసీఎంఎస్ ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తీసుకువచ్చిన ధాన్యంలోని తేమశాతం, తూకం, తూర్పారపట్టే విధానాలను పరిశీలించారు. తుఫాన్ దృష్ట్యా రైతులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సూచనలు చేశారు.
కొత్వాల మాట్లాడుతూ, రైతుల శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని తెలిపారు. ఒకే దఫా 2 లక్షల రుణమాఫీకి రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల కోట్ల రుణమాఫీ అమలు చేసిందన్నారు. రైతులు పండించిన సన్న వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ. 500 అదనంగా ఇస్తున్నదని వివరించారు. త్వరలోనే రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నెలకొండపల్లి ఎ.ఎం.సి చైర్మన్ వెన్నెపూసల సీతారాములు, కార్యదర్శి ఎన్. నాగేశ్వరి, డీసీఎంఎస్ డైరెక్టర్, మైనంపల్లి సొసైటీ చైర్మన్ నాగుబంటి శ్రీనివాసరావు, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ కె. సందీప్, రాంచంద్రాపురం సొసైటీ చైర్మన్ గుడవెల్లి రాంబ్రహ్మం, బోదులబండ సొసైటీ చైర్మన్ అనంత కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment