మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి - ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి - ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన

జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్  :సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేసి వివాదాస్పదంగా మారారు. ఆయన ఇంటి వద్దకు వచ్చిన జర్నలిస్టులపై మోహన్ బాబు దుర్భాషలాడుతూ, దాడి చేసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు. మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోషల్ మీడియా (X) వేదికగా చేసిన పోస్ట్ లో, "అయ్యప్ప మాలలో ఉన్న మీడియా ప్రతినిధిపై దాడి చేయడం సిగ్గుచేటు, అమానుషం," అని ఆయన మండిపడ్డారు.

ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు సైతం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  మంచు మనోజ్‌తో పాటు మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లిన పలువురు జర్నలిస్టులపై మోహన్ బాబు ఆగ్రహం ప్రదర్శించడం..ఆ సమయంలోఆయన వారిని బండ బూతులు తిడుతూ దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా అవుతున్నాయి.

Blogger ఆధారితం.