మోడ్రన్ ఇఖ్రా స్కూల్ లో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా కొత్తగూడెం మున్సిపాలిటీ 12వ వార్డులోని సుభాష్ చంద్రబోస్ నగర్ రామవరంలో మోడ్రన్ ఇఖ్రా స్కూల్ లో జాతీయ రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, రైతు దేశానికి వెన్నెముక అని, రైతులు పంటలు పండించడం లేకపోతే మనకు ఆహారం లభించదని, మానవ మనుగడే లేకుండా పోతుందని అన్నారు. అలాంటి రైతులను అందరూ గౌరవించాలన్నారు.
అదే విధంగా చౌదరి చరణ్ సింగ్ ఒక రైతుగా మరియు ప్రధానమంత్రిగా నిజాయితీగా దేశానికి సేవ చేశారని పేర్కొంటూ, ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన అధ్యాపకురాలు పర్వీన్ సుల్తానా, నీలా, శీరిషా, సరస్వతీ, సల్మా, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment