2K బ్యాచ్ పోలీస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2000 బ్యాచ్‌లో భర్తీ అయిన కానిస్టేబుల్స్ ఆదివారం పాల్వంచ పెద్దమ్మ గుడి సమీపంలోని విజయ్ కృష్ణ ఫంక్షన్ హాల్‌లో విధుల్లో చేరి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 2000 సంవత్సరంలో కానిస్టేబుల్స్‌గా భర్తీ అయ్యి ప్రస్తుతం వివిధ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఈ వేడుకలలో పాల్గొని తమ గత స్మృతులను పంచుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కొన్ని తీర్మానాలను చేయడం జరిగినట్లు తెలిపారు. 2000 బ్యాచ్‌కు చెందిన ప్రతి ఒక్కరి జీతం నుండి ప్రతి నెల 500 రూపాయలను జమ చేస్తూ ఒక సొసైటీని ఏర్పాటు చేయడం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సొసైటీ ద్వారా బ్యాచ్‌కు చెందిన ఎవరికైనా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు, రోడ్డు ప్రమాదాల వంటి అనుకోని సంఘటనల సమయంలో, లేదా మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు వీలు అవుతుందని తెలిపారు.

Post a Comment