ఇందిరమ్మ గృహాల మంజూరు సర్వేను వేగవంతం చేయాలి - కొత్వాల

ఇందిరమ్మ గృహాల మంజూరులో సర్వేను వేగవంతం చేయాలి - కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : తెలంగాణా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న ఇందిరమ్మ పక్కా గృహాల మంజూరులో సర్వేను వేగవంతం చేయాలని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు శనివారం పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సూచించారు.


ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు పేదలకు 5 లక్షలతో ఇంటి నిర్మాణం సహాయం అందించేందుకు ప్రజాపాలన సభలలో దరఖాస్తులు స్వీకరించాయని తెలిపారు. మంజూరు విషయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్వే టీం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


కొత్వాల, "లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు" అని చెప్పారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన ప్రతి లబ్ధిదారుని వివరాలు సేకరించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సర్వేలో ఆలస్యమైనా, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. లబ్ధిదారుని ఇంటి స్థలంతో సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకపోయినా, సాదాబైనామా, ఎగ్రీమెంట్ డాక్యుమెంట్లతో కూడా మంజూరు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.


ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాలే జానకిరెడ్డి, ఎల్.డి.ఏం కోఆర్డినేటర్ బద్ది కిషోర్, మాజీ జడ్పిటిసి సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, సొసైటీ డైరెక్టర్ కనగాల నారాయణ, కాంగ్రెస్ నాయకులు బాలినేని నాగేశ్వరరావు, కందుకూరి రాము, పైడిపల్లి మహేష్, కాపా శ్రీను, చాంద్ పాషా, ఉండేటి శాంతివర్ధన్, మాలోత్ కోటి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.