సీనియర్ న్యాయవాది మాధవరావు కన్నుమూత

సీనియర్ న్యాయవాది మాధవరావు కన్నుమూత

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (AILU) శ్రేయోభిలాషి గొర్రెపాటి మాధవరావు శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురైన ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా మరణించారు.


మాధవరావు భౌతికకాయాన్ని విద్యార్థుల పరిశోధనల కోసం నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆదివారం ఉదయం అందజేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన నేత్రాలను లయన్స్ క్లబ్‌కు దానం చేయనున్నారు.


మాధవరావు మరణ వార్త తెలిసిన వెంటనే శ్రద్ధాంజలి ఘటంచడానికి AILU రాష్ట్ర అధ్యక్షులు, బార్ కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ నిజామాబాద్ బయలుదేరి వెళ్లారు. రాజ్యం దురంతాలపై పోరాడిన ధీరుడు మాధవరావు అని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ మాధవరావు సేవలను కొనియాడింది.

Blogger ఆధారితం.