అంకితభావంతో ముందుకెళ్లాలి - పోస్టల్ ఎస్పీ వీరభద్ర స్వామి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పోస్టల్ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ ముందుకెళ్లాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ ఎస్పీ వీరభద్ర స్వామి అన్నారు. శనివారం పాల్వంచలోని స్థానిక పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో జరిగిన పోస్టల్ సిబ్బంది సమావేశంలో పాల్గొని, ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా పోస్టల్ ఎస్పీ వీరభద్ర స్వామి మాట్లాడుతూ "పాల్వంచ సబ్ డివిజన్ పరిధిలోని గ్రామీణ తపాలా ఉద్యోగులు మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా పోస్టల్ శాఖ తీసుకొస్తున్న మార్పులను గ్రామీణ స్థాయిలో ప్రజలకు వివరించి, పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న పథకాలను వారికి చేరువ చేయాలని" అన్నారు.
"ప్రతి ఉద్యోగి సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలమని" ఆయన తెలిపారు. అలాగే, "ముఖ్యంగా తక్కువ ప్రీమియంతో అందే జీవిత బీమా పథకాలకు సంబంధించి ప్రజలను చైతన్యం చేయాలని" ఆయన సూచించారు. "ఈ కార్యక్రమం ద్వారా మనం గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు పరోక్షంగా సేవను అందించగలుగుతాము" అని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ ఏం. వీరన్న, IPPB మేనేజర్ సంజయ్, మెయిల్ ఓవర్సీస్ దుర్గాప్రసాద్, పాల్వంచ సబ్ పోస్ట్ మాస్టర్ నాగమణిషా, బ్రాంచి పోస్ట్ మాస్టర్ బండి ఎల్లారావు తిలక్, రామారావు, సిద్దయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment