మోహన్ బాబుకు అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్ :గత కొన్ని రోజులుగా ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు చోటు చేసుకుంటున్న విషయం అందరికి తెలిసిందే.. తాజాగా, జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితిలో మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఆయనను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మోహన్ బాబుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మోహన్ బాబుతో పాటు ఆయన కుమారుడు మంచు విష్ణు కూడా ఆసుపత్రికి వచ్చారు. కాగా, మోహన్ బాబుపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారు తక్షణమే మీడియాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో, మోహన్ బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ఆయన ఇంటి ఎదుట బైటాయించి ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.

Post a Comment