పెద్దమ్మతల్లి గుడిలో వైభవంగా "చండీహోమం"
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పౌర్ణమిని పురస్కరించుకొని పాల్వంచ మండలం, కేశవాపురం - జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి) నందు "చండీహోమం" ఆదివారం దేవస్థాన ఆవరణలో గల యాగశాలలో నిర్వహించారు. "ముందుగా మేళతాళాలతో, వేదమంత్రాలతో అమ్మవారి ఉత్సవ విగ్రహమును దేవాలయం నుండి యాగశాలకు తీసుకొనివచ్చి, మండపారాధన, గణపతి పూజలు జరిపి అనంతరం చండీహోమం, చివరన పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ హోమంలో 21 మంది దంపతులు ఒక్కొక్కరు రూ. 2516/- రుసుము చెల్లించి చండీహోమంలో పాల్గొన్నారు. చండీహోమం అనంతరం అర్చకులు, వేదపండితులు చండీహోమంలో పాల్గొన్న వారికి ఆశీర్వచనంతో పాటు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం అందచేసినారు. అదేవిధంగా సామూహికి సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించబడినది. అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Post a Comment