పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి సీతక్క
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మ తల్లి గుడి)కి గురువారం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం కార్యనిర్వాహణాధికారి, వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభంతో మంత్రిని స్వాగతం పలికారు.
పూజల అనంతరం వేద పండితులు, అర్చకులు మంత్రికి ఆశీర్వచనాలు అందించి అమ్మవారి శేష వస్త్ర ప్రసాదం అందజేశారు.

Post a Comment