లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ

లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పని చేసి, ఇటీవల కాలంలో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఏడుగురు సభ్యులకు రివార్డు చెక్కులను సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అందజేశారు. ఈ కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగింది.

రివార్డు పొందిన సభ్యుల వివరాలు:

1. పోడియం మంగు అలియాస్ దేవేందర్ (24) – తుమ్రేల్ గ్రామం, పామేడు పోలీస్ స్టేషన్ పరిధి, బీజాపూర్ జిల్లా. రివార్డు: ₹4,00,000.

2. మడకం అడిమె అలియాస్ అనూష (23) – కొరకట్పాడు గ్రామం, చర్ల మండలం. రివార్డు: ₹4,00,000.

3. కోరం సోమయ్య అలియాస్ సోమ (20) – గొల్ల గుప్ప గ్రామం, ఎటపాక, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. రివార్డు: ₹1,00,000.

4. సొడ్డి పొజ్జి అలియాస్ చిలుక (25) – డోకుపాడు గ్రామం, కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధి, సుకుమా జిల్లా. రివార్డు: ₹4,00,000.

5. మడివి సోమిడి అలియాస్ రమ్య (22) – డోకుపాడు గ్రామం, కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధి, సుకుమా జిల్లా. రివార్డు: ₹4,00,000.

6. మడకం ఇడుమయ్య అలియాస్ మహేష్ (22) – అడవిరామారం గ్రామం, ఆళ్లపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. రివార్డు: ₹1,00,000.

7. లక్ష్మయ్య అలియాస్ కల్లు (22) – కిష్టారంపాడు గ్రామం, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. రివార్డు: ₹1,00,000.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలలో లొంగిపోయిన 26 మంది మావోయిస్టు సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రివార్డు నగదును వారి పునరావాసానికి అందజేయడం జరిగిందని తెలిపారు. 

నిషేధిత మావోయిస్టు పార్టీలో ఉన్న సభ్యులు తమ ఆయుధాలను వదిలి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల హక్కుల కోసం పోరాడాలని ఎస్పీ కోరారు. సాధారణ జీవితాన్ని గడపాలనుకునే వారు తమ బంధుమిత్రుల ద్వారా లేదా స్థానిక పోలీసుల ద్వారా లేదా స్వయంగా జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోవాలని సూచించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అందించే అన్ని రకాల సాయం త్వరితగతిన అందజేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి. సాయి మనోహర్, దుమ్ముగూడెం సీఐ అశోక్, చర్ల సీఐ రాజు వర్మలు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.