క్రీడలు జీవితంలో భాగం కావాలి - జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

క్రీడలు జీవితంలో భాగం కావాలి.. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :ప్రతి ఒక్కరూ క్రీడలను తమ జీవితంలో  భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్‌తో కలిసి ప్రారంభించారు. 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల ద్వారా మెడల్స్ సాధించడమే కాకుండా ఆటలను ఆడుతూ ఆస్వాదించడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం పెరుగుతుందని చెప్పారు. ఆయన సీఎం కప్ ద్వారా గ్రామీణ స్థాయిలో క్రీడాకారులు ప్రతిభ కనబరచి జిల్లా స్థాయిలో ఉత్తమంగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడల అభివృద్ధి కోసం జిల్లా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అవసరమైన నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.


గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం తమ లక్ష్యమని, ఈ తరహా చర్యలను ఇంకా కొనసాగిస్తామని తెలిపారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహించేందుకు ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.


అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ మాట్లాడుతూ "క్రీడలు మనస్సుకు ఆనందాన్ని మరియు శారీరక శక్తిని అందిస్తాయి. ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఆటలాడడం మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తాయి" అని చెప్పారు. సీఎం కప్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు సహకారం అందించే కోచ్‌లకు ఆయన సలహాలు ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యుగంధర్ రెడ్డి, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ నరేష్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి పరందామరెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు కమలారాణి, రమేష్, శ్రీధర్, ఉదయ్, కాశీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.