మాజీ ప్రధానికి కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఘన నివాళి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఘనంగా నివాళులర్పించింది. కొత్తగూడెం బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదుల అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా రెండు నిమిషాల మౌనం పాటించారు.
ఈ సందర్భంగా లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ "డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి దిశగా కొత్త పుంతలు తొక్కించిన నాయకుడు. ఆయన సేవలు భారత దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తాయి," అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కె. పుల్లయ్య, సింగు ఉపేందర్, మునిగడప వెంకటేశ్వర్లు, కె.వి. శేషవతారం, మారపాక రమేష్ తదితరులు పాల్గొని డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు.
బార్ ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు, కార్యదర్శి ఎం.ఎస్.ఆర్. రవిచంద్ర, కార్యవర్గ సభ్యులు దూదిపాల రవి, ఎం.డి. సాదిక్ పాషా, నల్లమల్ల ప్రతిభ, ఎస్. ప్రవీణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post a Comment