చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలోని చుంచుపల్లి సర్కిల్ ఆఫీస్‌ను శుక్రవారం కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ తనిఖీ చేశారు. సర్కిల్ ఆఫీస్ ఆవరణలో మొక్కను నాటిన తర్వాత, సిబ్బందితో సమావేశమై వారి విధులు అడిగి తెలుసుకున్నారు. రికార్డుల సరైన నిర్వహణ, నమోదైన కేసులను సీసీటీఎన్ఎస్ (CCTNS)లో నమోదు చేయడంపై దృష్టి సారించాలని సూచించారు.
పెండింగ్‌లో ఉన్న గంభీర కేసులపై సమీక్ష నిర్వహించి, వాటిని పూర్తి చేయడంపై ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. సైబర్ నేరాలపై విచారణను వేగవంతం చేయాలని, విజిబుల్ పోలీసింగ్‌ను మెరుగుపరచాలని సూచించారు. అన్ని గ్రామాలకు గ్రామ పోలీసు అధికారులను కేటాయించి శాంతి భద్రతలను పటిష్టం చేయాలని ఆదేశించారు.
డిఎస్పి రికార్డుల నిర్వహణ, ఈ-సాక్షి అప్లికేషన్ ఉపయోగం, కోర్టు డ్యూటీలు, పెండింగ్ సమన్లు, వారెంట్ల తదితర అంశాలను పరిశీలించారు. సిబ్బందికి నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన అనుసరించడంపై గట్టి దృష్టి పెట్టాలని చెప్పారు.
చుంచుపల్లి సర్కిల్ పరిధిలో దర్యాప్తు కొనసాగుతున్న గ్రేవ్ కేసులు, నిందితుల అరెస్టులు, గంజాయి, సైబర్ నేరాలపై దర్యాప్తు తీరును సమీక్షించారు. పోలీసు అధికారులతో మాట్లాడిన డిఎస్పి, శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యం సహించేది లేదని హెచ్చరించారు. నేరాల నివారణ కోసం అధికారులు సమిష్టిగా పనిచేయాలని, ప్రజల ఫిర్యాదులను ఓపికతో వినాలని చెప్పారు.
త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శించి, రౌడీలను, సస్పెక్ట్స్‌లను గుర్తించి, ముందస్తు సమాచారం సేకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు, సర్కిల్ ఎస్సైలు రమణారెడ్డి, రవికుమార్, రమాదేవి, ట్రైనీ ఎస్సై అఖిల, సర్కిల్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment