వాడవాడలా సీపీఐ శతవసంతాల పండుగ జరుపుకుందాం - సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా

 

వాడవాడలా సీపీఐ శతవసంతాల పండుగ జరుపుకుందాం - సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : వాడవాడలా సీపీఐ శతవసంతాలు పండుగ జరుపుకుందామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా పిలుపునిచ్చారు. గురువారం పాల్వంచలోని స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవనంలో సీపీఐ పాల్వంచ మండల, పట్టణ విస్తృత కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సాబీర్ పాషా మాట్లాడుతూ డిసెంబర్ 26 నాటికి పార్టీ వందేళ్లు పూర్తయ్యే సందర్భంలో గ్రామగ్రామాన, బస్తీబస్తీన వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించి పార్టీ చరిత్రను, త్యాగాలను ప్రజలకు వివరించాలని, ప్రతి గ్రామం, బస్తీలో ఉత్సవాలు ఘనంగా జరిగేలా ప్రణాళిక రూపొందించుకోవాలని, డిసెంబర్ 26న ప్రతి ఇంటిపై ఎర్రజెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. 

పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ అయిన సీపీఐ, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్రజెండా పార్టీకి ఎదురులేదని, మరో వందేళ్లైనా చెక్కు చెదరకుండా అజేయంగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు.

ప్రజాక్షేత్రంలో ఉండి అన్నివర్గాల ప్రజలకు అందిస్తున్న సేవల ఫలితంగా సీపీఐకి రోజురోజుకి ప్రజాదరణ పెరుగుతోందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రతి పంచాయతీలో సీపీఐ ప్రాతినిధ్యం ఉండేలా ఇప్పటి నుంచి ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. పాల్వంచ ప్రాంత సమగ్ర అభివృద్ధిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రత్యేక దృష్టి సారించారని, ఇప్పటికే వివిధ పథకాలతో రోడ్లు, డ్రైన్లు, నీటి పథకాలు శరవేగంగా పనులు పూర్తి చేశారని, మిగిలిన పనులు త్వరలో ప్రారంభం అవుతాయని తెలిపారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇల్లు పథకంలో అర్హులైన పేదలకు మంజూరయ్యేలా నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకుని జరుగుతున్న సర్వేలో భాగస్వాములు కావాలని కోరారు.

పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత, ఈ దేశంలో అందరికీ సమాన హక్కులు కలిగి ఉండాలని పరితపించిన డా. బాబా సాహెబ్ అంబేడ్కర్‌పై అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ఆ రాజ్యాంగం వలన పదవి పొందిన ఆయన తక్షణమే పదవి నుంచి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, వీ పద్మజ, సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, శనగరపు శ్రీనివాసరావు, ఎం.డి. అస్లాం, నరహరి నాగేశ్వరరావు, ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబు, కొంగర అప్పారావు, వర్క్ అజిత్, వై. వెంకట్రామయ్య, మడుపు ఉపేంద్ర చారి, మన్నెం వెంకన్న, ఎస్.కె. రెహమాన్, వల్లపు యాకయ్య, నాగమల్ల సత్యనారాయణ, కరీం, జకరయ్య, సత్యనారాయణ, వై.ఎస్. గిరి, మాజీ సర్పంచులు భూక్యా విజయ్, హరి, సపావట్ వెంకటరమణ, వగెల పద్మ, మాజీ కౌన్సిలర్ చెన్నయ్య, బిక్కులాల్, వేములపల్లి శ్రీను, చంచలపురి శీను, కోడి నాగేశ్వరరావు, కొత్త సురేష్, బాణోత్ రంజిత్, సాయిలు శ్రీను, ఎర్రగడ్డ ప్రభాకర్, ఉప్పుశెట్టి రాకేష్, శ్రీనివాసరావు, వెంకన్న, రేగు కృష్ణమూర్తి, రాము, కృష్ణ, ఆదినారాయణ, గురుమూర్తి, చంద్రశేఖర్, సుంకర రంగారావు, ఎస్.కె. కసీం, విజయ్ కుమార్, సంఘమిత్ర, కమటమేశ్వరమ్మ, లక్ష్మి, మేరమ్మ, ఎస్.కె. లాల్ పాషా, అల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Blogger ఆధారితం.