గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్
జె.హెచ్.9. మీడియా,హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిశోర్ నియమితులయ్యారు. గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన బుర్రా వెంకటేశం వీఆర్‌ఎస్ తీసుకోవడంతో ఆయన స్థానంలో దాన కిశోర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వుల రూపంలో వెల్లడించారు.
ఇప్పటికే దాన కిశోర్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్నారు.


Post a Comment