రేగళ్ల పిహెచ్‌సీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్య అధికారి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎల్. భాస్కర్ నాయక్ శనివారం రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇన్‌పేషంట్ రిజిస్టర్లు, లాబొరేటరీ, డ్రగ్ స్టోర్స్ రిజిస్టర్లను పరిశీలించారు.  ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ను 100 శాతం పూర్తిచేయాలని, నిక్షయ శిబిరంలో అనుమానితులకు క్షయ పరీక్షలు నిర్వహించాల్సిందిగా సూచించారు. సికిల్ సెల్ అనిమియా కార్డులు 100 శాతం పంపిణీ చేయాలని, అసంక్రమిక వ్యాధులను గుర్తించి తగిన చికిత్స అందించాలని ఆదేశించారు. చలికాలంలో వృద్ధులు, చిన్నపిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ హరీష్, ఎం. వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ రామచందు, సూపర్వైజర్, స్టాఫ్ నర్స్ కవిత, ఫార్మసిస్ట్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎల్. భాస్కర్ నాయక్ శనివారం రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇన్‌పేషంట్ రిజిస్టర్లు, లాబొరేటరీ, డ్రగ్ స్టోర్స్ రిజిస్టర్లను పరిశీలించారు.


ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌ను 100 శాతం పూర్తిచేయాలని, నిక్షయ శిబిరంలో అనుమానితులకు క్షయ పరీక్షలు నిర్వహించాల్సిందిగా సూచించారు. సికిల్ సెల్ అనిమియా కార్డులు 100 శాతం పంపిణీ చేయాలని, అసంక్రమిక వ్యాధులను గుర్తించి తగిన చికిత్స అందించాలని ఆదేశించారు. చలికాలంలో వృద్ధులు, చిన్నపిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ హరీష్, ఎం. వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ రామచందు, సూపర్వైజర్, స్టాఫ్ నర్స్ కవిత, ఫార్మసిస్ట్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.