ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

 

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :ఆది, సోమవారాల్లో రెండు రోజులపాటు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎలాంటి అవాంతర సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు పూర్తి కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా 38 పరీక్ష కేంద్రాల్లో అధికారులు 144 సెక్షన్ అమలు చేశారు.

జిల్లాలో 13,466 మంది పరీక్షకు హాజరు కావలసి ఉండగా, మొదటి రోజు ఆదివారం రెండు సెషన్లలో 12,572 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రెండవ రోజు సోమవారం రెండు సెషన్లలో 12,343 మంది హాజరయ్యారు.

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లో గల సెంట్ మేరీస్ హై స్కూల్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు

Blogger ఆధారితం.