సత్వర న్యాయానికై లోక్ అదాలత్ - జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి కుటుంబం విభజన చెందడం వల్ల కుటుంబంలో కలతలు పెరిగాయని అన్నారు. చిన్న చిన్న గొడవలు, క్షణికావేశంలో చేసిన నేరాల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతూ తమ విలువైన కాలం, డబ్బు వృథా అవుతుందని, కక్షిదారులు ఒక్క అడుగు రాజీ మార్గం దిశగా ప్రయత్నం చేస్తే ప్రతివాదులు రెండు అడుగులు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
కార్యక్రమం అనంతరం యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకుల సహకారంతో కక్షిదారులకు పులిహార, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయబడింది.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.రామారావు, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎ.సుచరిత, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, న్యాయవాదులు, బ్యాంక్ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment