జిల్లాలో రైన్ వాటర్ ప్రాజెక్ట్ బృందం విస్తృత పర్యటన
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :కొత్తగూడెం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కై జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ చొరవతో రైన్ వాటర్ ప్రాజెక్ట్ బృందం, స్టూడియో పంచతంత్ర బృందం ఆదివారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యాటనులో భాగంగా బృందాలు మొదట కిన్నెరసాని అభయారణ్యాన్ని సందర్శించాయి. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బృందానికి కిన్నెరసాని ప్రత్యేకతలు, పర్యాటక రంగం అభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలు గురించి వివరించారు.
తర్వాత, బృందం కిన్నెరసాని ప్రాజెక్టులో బోటులో ప్రయాణించి ఆనంద ద్వీపాన్ని సందర్శించింది. డ్రోన్ కెమెరా ద్వారా కిన్నెరసాని అభయారణ్యాన్ని వీక్షించారు. జింకల పార్కు, ప్రాజెక్టు, బాతుల పార్క్ ను పరిశీలించారు. అనంతరం, కిన్నెరసాని ప్రాజెక్టు కేటీపీఎస్ కుడి కాలువలో పుట్టి ప్రయాణాన్ని ప్రారంభించారు.
తర్వాత, భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని దర్శించుకుని, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. తదుపరి, గోదావరి ఘాట్ ను సందర్శించారు. భద్రాచలం ఐటిడిఏ పరిధిలో నిర్మిస్తున్న గిరిజన మ్యూజియంతోపాటు మరికొన్ని పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించారు.

Post a Comment