భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద కే.ఏ. పాల్ ధర్నా

 

భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద కే.ఏ. పాల్ ధర్నా

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద జరుగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నాలో బుధవారం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా, రోడ్డుపైన అకస్మికంగా కనపడిన కే.ఏ. పాల్‌తో సెల్ఫీలు దిగేందుకు జనాలు పోటీ పడ్డారు.

మణుగూరు సమీపంలోని పగిడేరులో ప్రజాశాంతి పార్టీ సమావేశానికి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ సమయంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా శిబిరం కనిపించి, ఆయన తన వాహనాన్ని ఆపి వారికి  సంఘీభావం ప్రకటించారు.

కే.ఏ. పాల్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను సమగ్ర శిక్ష ఉద్యోగులకు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Blogger ఆధారితం.