వీటిని వదలం.. ఆ ఇళ్లను కూల్చం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ సంచలన వ్యాఖ్యలు

వీటిని వదలం.. ఆ ఇళ్లను కూల్చం.. హైడ్రా రంగనాథ్‌ సంచలన వ్యాఖ్యలు


జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్  : హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల వైపుకి వెళ్ళమని, జూలై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలను తప్పక కూల్చివేస్తామని స్పష్టం చేశారు.


ఈరోజు హైడ్రా బృందం మూసాపేటలోని కాముని చెరువును పరిశీలించింది. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ, హైడ్రా మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని, జూలై తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను తప్పక కూల్చివేస్తామని స్పష్టం చేశారు. అలాగే గతంలో అనుమతులు తీసుకుని ఇప్పుడు నిర్మిస్తున్న వాటి వైపు వెళ్లమని, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటిని హైడ్రా కూల్చివేస్తుందని చెప్పారు.

ఇక, ఇటీవల కాలంలో తీసుకున్న అనుమతులను హైడ్రా తనిఖీ చేస్తుందని, వాటిలో లోపాలు ఉంటే ఆ నిర్మాణాలను అడ్డుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా పని చేస్తుందని ఆయన తెలిపారు.

హైడ్రా పేదవాళ్లకు, చిన్న వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలిగించదని, పేదవాళ్ల ఇండ్లను కూల్చేస్తుందనే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రంగనాథ్ సూచించారు.


Blogger ఆధారితం.