గ్రూప్-2 పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : టీజిపిఎస్సి ఆధ్వర్యంలో ఆదివారం మొదలైన గ్రూప్-2 పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సందర్శించారు. పరీక్షా కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్ కళాశాల మరియు పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రాలను సందర్శించి అక్కడ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Post a Comment